క్వశ్చన్‌కి ఆన్సర్ల వినిపిస్తున్న ఆ రెండు సినిమా టైటిల్స్
on Oct 4, 2019
తెలుగు సినిమా పేర్లల్లో రోజు రొజుకు సినిమాకు కధకు,సినిమా పేరు సంబంధం లేకుండా పోతోంది .తెలుగు సినిమా పేర్లలో సృజనాత్మకత కరువవుతోందని కొందరు విమర్శిస్తుంటారు. ఆంగ్ల భాష పదాలకు లోటు ఉండదని పడికట్టు పదాలనే వాడతారని కొందరు వ్యాఖ్యానిస్తుంటారు. దానికి భిన్నంగా అక్టోబర్ ఎనిమిదిన "ఎవరికీ చెప్పొద్దు" పేరుతో ఓ సినిమా వస్తుంటే అదే రోజున పధ్ధెనిమిదిన "మీకు మాత్రమే చెప్తా" అంటూ మరో చిత్రం జనం ముందుకు వస్తోంది. ఈ రెండు సినిమాలలో ఉన్న కామన్ పాయింట్ రొమాంటిక్ లవ్ స్టోరీ. మొదటిదానిలో కులం కారణంగా ఓ యువ జంట ఎలాంటి ఇబ్బందులూ పడిందనే దాన్ని చూపించగా, రెండో సినిమాలో స్నేహం ప్రేమ మధ్య సతమతమయ్యే కుర్రాడి కథను చెప్పారు."ఎవరికీ చెప్పొద్దు" చిత్రం ద్వారా నటుడు రాకేష్ వర్రె హీరోగా పరిచయమవుతున్నాడు.
ఈ మూవీకి అతనే ప్రొడ్యూసర్, హీరోయిన్ గార్గేయి ఎల్లాప్రగడ, దర్శకుడిగా బసవ శంకర్, సంగీత దర్శకుడిగా శంకర్ శర్మ ఈ చిత్రంతో పరిచయం అవుతున్నారు. ఇక "మీకు మాత్రమే చెప్తా" మూవీ తో దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా పరిచయం అవుతున్నాడు. హీరోయిన్ గా వాణి భుజం, డైరెక్టర్ గా షమీర్ సుల్తాన్, మ్యూజిక్ డైరెక్టర్ గా శివ కుమార్ ఇంట్రడ్యూస్ అవుతున్నారు. దీన్ని తొలి సారిగా నిర్మాతగా మారి విజయ్ దేవరకొండ నిర్మిస్తుండటం విశేషం. ఈ రెండు సినిమాల విజయంపై ఎంతో మంది నటీనటులు సాంకేతిక నిపుణుల భవిష్యత్ ఆధారపడి ఉంది. అందుకే ఈ రెండు చిత్రాల బృందం ప్రమోషన్స్ లో భాగంగా కాలేజీల్లో జోరుగా పర్యటనలు చేస్తున్నాయి. మరి ఈ యూత్ ఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరీ మన రౌడికి ఎలాంటి విజయాన్ని తెచ్చిపెడుతుందో వేచి చూడాలి.