'కమిట్‌మెంట్' అంటే అదేనా?
on Apr 23, 2020
ఈ రోజుల్లో 'కమిట్‌మెంట్' పదానికి నానా అర్థాలు తీస్తున్నారని దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా అన్నారు. చాలా మంది 'కమిట్‌మెంట్' పదాన్ని 'సెక్స్'కి ఆపాదిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. సుమారు పదిహేనేళ్ల క్రితం 'హైదరాబాద్ నవాబ్స్' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన లక్ష్మీకాంత్ చెన్నా, మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఇప్పుడు 'కమిట్‌మెంట్' సినిమాతో మరోసారి సక్సెస్ అందుకోవాలని ఆశపడుతున్నారు.
తేజస్వి మదివాడ, అన్వేషి జైన్, రమ్య పసుపులేటి, శ్రీనాథ్ మాగంటి, సూర్య శ్రీనివాస్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన 'కమిట్‌మెంట్' ఫస్ట్ లుక్ కొన్ని రోజుల క్రితం విడుదలైంది. అది చూస్తే సినిమా బోల్డ్‌గా ఉంటుందని తెలుస్తుంది. అయితే... తన సినిమాలో లవ్ 'కమిట్‌మెంట్' గురించి చెప్పానని లక్ష్మీకాంత్ చెన్నా అన్నారు. నాలుగు కథలతో సినిమా తెరకెక్కించినట్టు ఆయన తెలిపారు. నాలుగు కథల్లో ఒక కథలో తేజస్వి మదివాడ బడ్డింగ్ యాక్ట్రెస్‌గా కనిపిస్తుందని, కాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదురుకావడంతో సినిమా ఇండస్ట్రీ వదిలి వేరే రంగానికి వెళుతుందని, అక్కడ కూడా సేమ్ ప్రాబ్లమ్ ఎదురవుతుందని ఆయన అన్నారు. అన్ని రంగాల్లోనూ ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తులు సెక్సువల్ ఫేవర్స్ అడుగుతారని చెప్పడమే సినిమా ముఖ్య ఉద్దేశమని లక్ష్మీకాంత్ చెన్నా స్పష్టం చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
