ఆ హీరోయిన్ కుక్కపిల్ల పేరు బన్నీ
on Jan 25, 2020
'ఆర్.ఎక్స్. 100' హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ గుర్తుంది కదూ! రీసెంట్ గా రవితేజ 'డిస్కో రాజా'లో మూగ, చెవిటి అమ్మాయిగా నటించింది. ఈ హాట్ హీరోయిన్ కుక్క పిల్ల పేరు బన్నీ. మీరు చదివింది నిజమే. బన్నీ అంటే తెలుగు ప్రేక్షకులకు స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ గుర్తొస్తారు. కానీ, పాయల్ రాజ్ పుత్ కు మాత్రం ముందుగా తన కుక్కపిల్ల గుర్తొస్తుంది. సోషల్ మీడియా వల్ల పాయల్ తన కుక్క పిల్లకు బన్నీ అని పేరు పెట్టిన సంగతి బయటకు వచ్చింది. రెండు రోజుల క్రితం 'బన్నీ కి ఒంట్లో బాలేదు' అని పాయల్ ఒక పోస్టు పెట్టింది. అందులో కుక్క పిల్ల ఉంది. నిన్న "బన్నీకి ఇప్పుడు కొంచెం బెటర్. మీరందరూ తన ఆరోగ్యం అని ఆందోళన చెందినందుకు థాంక్యూ" అని మరో పోస్టు చేసింది. అందులోనూ కుక్క పిల్ల ఉంది. అప్పుడు ఒక స్పష్టత వచ్చింది... పాయల్ కుక్క పిల్ల పేరు బన్నీ అని. అదీ సంగతి!
'డిస్కో రాజా'లో మొత్తం ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. నభా నటేష్, తాన్యా హోప్ తో పోలిస్తే పాయల్ రాజ్ పుత్ పాత్రకు కథలో కొంత ప్రాధాన్యత ఉంది. రవితేజ, పాయల్ మధ్య సీన్స్ కొంత బావున్నాయి. దాంతో ఈ అమ్మాయి చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ చేతిలో స్టార్ హీరోల సినిమాలు ఏవి లేవు. ఒక సినిమాలో పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తోంది. 'ఆర్.ఎక్స్. 100', 'ఆర్.డి.ఎక్స్ లవ్' టైప్ సినిమాకి సంతకం చేసిందట.