కొత్త అవతారంలో హెబ్బా పటేల్!
on Jan 25, 2020
హీరోయిన్లు పాటలు కొత్త ఏమీ కాదు. అవకాశం దొరికినప్పుడు గొంతు సవరించుకుంటూ ఉంటారు. హీరోలు, హీరోయిన్లు పాటలు పాడితే అదో క్రేజ్. అందుకని, వాళ్లతో పాటలు పాటించడానికి మ్యూజిక్ డైరెక్టర్లు ఇంట్రెస్ట్ చూపిస్తారు. రాశి ఖన్నా, నిత్య మీనన్, కలర్స్ స్వాతి వంటి హీరోయిన్లు ఇప్పటికే పాటలు పాడారు. ఈ లిస్ట్ లోకి 'కుమారి 21ఎఫ్' ఫేమ్ హెబ్బా పటేల్ కూడా చేరుతోంది. ఇప్పుడు హీరోయిన్ ఓ పాట పాడుతోంది. అసలు మేటర్ ఏంటంటే... అజయ్ భుయాన్ డైరెక్షన్ లో ఫేమస్ డైరెక్టర్ క్రిష్ ఒక వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. నవదీప్, చాందినీ చౌదరి, బిందు మాధవితో పాటు హెబ్బా పటేల్ కూడా అందులో ప్రధాన పాత్ర పోషిస్తోంది.
ఆ వెబ్ సిరీస్ కోసం ఆమె ఒక పాట పాడింది అని టాక్. మరో ఇంట్రెస్టింగ్ మేటర్ ఏంటంటే... ఆ వెబ్ సిరీస్ లో హెబ్బా పటేల్ ది సింగర్ క్యారెక్టర్. డిజిటల్ మీడియాలోకి ఒకేసారి సింగర్ గానూ, సింగర్ క్యారెక్టర్ తోనూ హెబ్బా పటేల్ ఎంట్రీ ఇవ్వనుంది. మరోపక్క సిల్వర్ స్క్రీన్ కోసం క్యారెక్టర్లు చేయడానికి కూడా అనే రెడీ అయింది. 'భీష్మ ', 'ఒరేయ్ బుజ్జి గా' సినిమాల్లో హెబ్బా పటేల్ ఇంపార్టెంట్ క్యారెక్టర్లు చేస్తోంది.