పవన్ వస్తే బన్నీ ఫీల్ అవుతాడు కదా!
on May 3, 2018

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో సఖ్యతగా మెదులుతున్నాడు. ఫామిలీ ఫంక్షన్స్ అటెండ్ అవడంతో పాటు, రామ్ చరణ్ రంగస్థలం సినిమా చూసి, ఆ తర్వాత సక్సెస్ మీట్ కి కూడా ముఖ్య అతిధిగా విచ్చేసారు. కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఫిలిం ఛాంబర్ లో ఏర్పాటు చేసిన నిరసన సభకి దాదాపు మెగా ఫామిలీ మొత్తం హాజరయ్యారు, అల్లు అర్జున్ తో సహా. ఇక మెగా ఫామిలీ మొత్తం ఒకటి అయింది, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అటెండ్ అవుతాడు అని వార్తలు వచ్చాయి. కానీ, అలా జరగలేదు. రామ్ చరణ్ ఒక్కడే ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా అటెండ్ అయ్యాడు. అయితే, పవన్ కళ్యాణ్ ని ఈ నెల 12 న జరగనున్న రవితేజ నేల టికెట్ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా ఇన్వయిట్ చేసారు. పవన్ వచ్చేది రానిది క్లారిటీ ఇవ్వనప్పటికీ, ఆయన వెళ్తే మాత్రం బన్నీ ఫీల్ అవడం ఖాయం అంటున్నారు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ అన్న కన్నబాబు మెగా ఫామిలీ తో మంచి అనుబంధం ఉంది కాబట్టి, పవన్ కళ్యాణ్ వేరే పనులు ఏవి లేకపోతే వెళ్లే అవకాశం ఉంది అంటున్నారు. చూడాలి, ఏం డిసైడ్ చేస్తాడో!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



