మహేష్ విషయంలో ఎమోషనల్ అయిన ఎన్టీఆర్
on May 2, 2018

మహేష్ అంటే మన సూపర్ స్టార్ మహేష్ బాబు కాదండి బాబూ, మొన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలంతో అందరి మన్ననలు అందుకున్న జబర్దస్త్ ఫేమ్ కమెడియన్ మహేష్. రామ్ చరణ్ పక్కనే ఉండి సినిమా మొత్తం అలరించిన మహేష్ నటనకి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ప్రత్యేకంగా మాట్లాడారంటే మహేష్ ఎంత అత్యద్భుతంగా నటించాడో అర్ధం చేసుకోవచ్చు. ఇక కొత్తగా ఎన్టీఆర్ కూడా మహేష్ ని ప్రశంసలతో ముంచెత్తాడు. ఈ విషయం ప్రస్తావిస్తూ, "బ్రదర్ మీరు షేక్ చేశారు, అదిరిపోయింది, చాలా ఎమోషన్ అయ్యాను మీ సీన్ చూసినప్పుడు, మనం కలుద్దాం," ఇవి ఎన్టీఆర్ అన్న నాతో మాట్లాడిన గోల్డెన్ వర్డ్స్ అని వివరించాడు.
ఇక తాను కింద కూర్చుని మాట్లాడుతుంటే పైన కూర్చోండి బ్రదర్ అని అన్నారని... పైన కూర్చుంటేనే కానీ ఊర్కోలేదు అని... ఆయన తో మాట్లాడిన తర్వాత ఆయనంత గొప్పవాడు ఎందుకయ్యారో అర్ధం అయిందని చెప్పుకొచ్చాడు. "మహానటి సినిమాలో యాక్ట్ చేసినందుకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానో, మహానటుడి తో మాట్లాడినందుకు కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను," అని తన సంతోషాన్ని వెలిబుచ్చారు. చూస్తుంటే ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తున్న సినిమాలో మహేష్ కి ఒక క్యారెక్టర్ ఇచ్చేట్టుగా ఉన్నాడు!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



