బాలకృష్ణకి తప్పని తిప్పలు
on May 3, 2018

ఏ ముహూర్తంలో బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ మొదలు పెట్టాడో కానీ, అస్సలు ముందుకు జరగడం లేదు. తన తండ్రికి ఈ సినిమాని అంకితం యుద్ధం అనుకున్న బాలకృష్ణకి మొదటి నుండి కష్టాలు ఎదురవుతున్నాయి. గత నెలలో లాంచ్ అయినా ఈ సినిమా ఈ పాటికి సెట్స్ పైకి వెళ్ళాల్సింది. ఎలాగయినా, దసరా కల్లా విడుదల చేద్దాం అనుకున్న బాలకృష్ణ కి పరిస్థితులు సహకరించడం లేదు. డైరెక్టర్ తేజ ఈ సినిమా నుండి వాక్ అవుట్ అయినప్పటి నుండి తల నొప్పులు ఇంకా ఎక్కువయ్యాయి. ఎవరూ ముందుకు రాకపోవడంతో, బాలకృష్ణే దర్శకత్వ బాధ్యతలు స్వీకరించే ధైర్యం చేశారు. కొందరు కే రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తాడు అంటే, మరికొందరు, చంద్రసిద్దార్థ కి ఈ బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. ఏది ఏమయినా, విపరీతమయిన కన్ఫ్యూజన్ లో ఉన్న బాలకృష్ణ, ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కొందరు, ఈ సినిమాని ఆపేస్తే బెటర్ అని సలహాలిస్తుంటే, మరి కొందరు మాత్రం ఖచ్చితంగా చేయాలి కానీ కాస్త టైం తీసుకొని చేయాలి అంటున్నారు. అసలే దర్శకత్వంలో అనుభవం లేని బాలకృష్ణకి చుట్టూ ఉన్నవాళ్లు మరింత ఇబ్బంది పెడుతున్నారని సమాచారం. మరి బాలకృష్ణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



