త్రివిక్రమ్ భార్య నృత్య ప్రదర్శన.. ఛీఫ్ గెస్ట్ గా పవర్ స్టార్!
on Dec 16, 2021

మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అయితే ఆయన సతీమణి సౌజన్య శ్రీనివాస్ కూడా ప్రతిభావంతురాలే. ఆమె మంచి క్లాసికల్ డ్యాన్సర్. గతంలో పలు వేదికలపై నాట్య ప్రదర్శన చేసి ఆమె తన ప్రతిభ చాటుకున్నారు. ఇప్పుడు ఆమె ప్రతిభ మరింత మందికి చేరువకానుంది. గురువారం సాయంత్రం 6 గంటలకు శిల్పకళా వేదికలో ఆమె ‘మీనాక్షి కళ్యాణం’ అనే శాస్త్రీయ నృత్య నాటక ప్రదర్శన ఇవ్వబోతున్నారు.
Also Read: 'భక్త కన్నప్ప' షూటింగ్ ఎక్కడ, ఎలా చేశారో తెలుసా?!
నిజానికి సౌజన్య శ్రీనివాస్ నృత్య ప్రదర్శన డిసెంబర్ 2 న జరగాల్సి ఉంది. అయితే ఆమె బాబాయ్, లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి నవంబర్ 30 న కన్నుమూయడంతో ఈ నాట్య ప్రదర్శన వాయిదా పడింది. తాజాగా సౌజన్య నాట్య ప్రదర్శనకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఆమె నాట్య ప్రదర్శన రేపు(డిసెంబర్ 17) సాయంత్రం 6 గంటల నుంచి శిల్పకళా వేదికలో జరగనుంది. దీనికి పసుమర్తి రామలింగ శాస్త్రి దర్శకత్వం వహించనున్నారు. హారిక అండ్ హాసిని ప్రొడక్షన్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ కలసి ఈ ఈవెంట్‌ను అందిస్తున్నాయి.

Also read: శారద ఒక సీన్ చేయడానికి 20 టేకులు తీసుకున్నారంటే సర్‌ప్రైజ్ అవ్వాల్సిందే!
ఇక ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరుకానుండటం విశేషం. గౌరవ అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ హాజరుకానున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి తనికెళ్ల భరణి, త్రివిక్రమ్ తదితరులు హాజరుకానున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



