అప్పుడు `అర్జున్ రెడ్డి`.. ఇప్పుడు `లైగర్`..!
on Dec 16, 2021

`అర్జున్ రెడ్డి`.. యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ కెరీర్ ని మేలిమలుపు తిప్పిన సినిమా. ఆ చిత్రంతో యువతరాన్ని విశేషంగా ఆకట్టుకున్నాడు విజయ్. తెలుగునాట సంచలనం సృష్టించిన ఈ సినిమా.. కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది. ఆపై `గీత గోవిందం`, `టాక్సీ వాలా` వంటి విజయాలతో టాలీవుడ్ లో తనదైన ముద్ర వేశాడు విజయ్. ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో `లైగర్` చేస్తున్నాడు ఈ రౌడీ హీరో.
స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న `లైగర్`లో బాక్సర్ గా నెవర్ సీన్ బిఫోర్ రోల్ లో ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమయ్యాడు విజయ్ దేవరకొండ. పాన్ - ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి తాజాగా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. 2022 ఆగస్టు 25న `లైగర్` జనం ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. `అర్జున్ రెడ్డి` కూడా 2017లో ఇదే ఆగస్టు 25న రిలీజైంది. మరి.. తన కెరీర్ లో మరపురాని తేదిగా నిలిచిన ఆగస్టు 25నే ఐదేళ్ళ తరువాత మరోసారి రానున్న విజయ్.. ఈ సారి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
Also Read: త్రివిక్రమ్ భార్య నృత్య ప్రదర్శన.. ఛీఫ్ గెస్ట్ గా పవర్ స్టార్!
కాగా, `లైగర్`లో విజయ్ దేవరకొండకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే నటిస్తుండగా లెజండరీ బాక్సర్ మైక్ టైసన్, వెటరన్ యాక్ట్రస్ రమ్యకృష్ణ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



