సమంత సాంగ్ కాంట్రవర్సీపై రెస్పాండ్ అయిన అల్లు అర్జున్!
on Dec 16, 2021

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ ఫిల్మ్ 'పుష్ప' డిసెంబర్ 17న విడుదలవుతోంది. ఈ మూవీలో సమంత ఒక ఐటమ్ సాంగ్ చేసింది. తన కెరీర్‌లో ఆమె చేసిన ఫస్ట్ ఐటమ్ సాంగ్ ఇదే. "ఊ అంటావా మావా.. ఉ ఊ అంటావా మావా" అంటూ సాగే ఆ పాట లిరికల్ వీడియోను ఇటీవల మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ పాటలోని సాహిత్యం కాంట్రవర్సీ సృష్టించింది. "మగాళ్ల బుద్ధి వంకర బుద్ధి" అనే లైన్ ఆ వివాదానికి కారణమైంది. ఈ కాంట్రవర్సీపై అల్లు అర్జున్ స్పందించాడు.
దేవి శ్రీప్రసాద్ ట్యూన్స్ సమకూర్చిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా, ఇంద్రావతి చౌహాన్ హస్కీగా పాడారు. సమంత, అల్లు అర్జున్, డాన్సర్ల బృందంపై ఈ పాటను చిత్రీకరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక పురుషుల సంఘం ఈ పాటను నిషేధించాలనీ, లేదంటే పాటలోని "మగాళ్ల బుద్ధి వంకర బుద్ధి" అనే లైన్ మార్చాలనీ కోరుతూ కోర్టుకెక్కారు.
Also read: తమిళనాడులో 400.. కేరళలో 250.. 'పుష్ప' స్క్రీన్స్!
నిన్న చెన్నైలో జరిగిన 'పుష్ప' ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న అల్లు అర్జున్‌కు మీడియా ప్రతినిధుల నుంచి ఈ కాంట్రవర్సీకి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. "దీనిపై మీ అభిప్రాయం ఏంటి?" అనే ప్రశ్నకు రెండంటే రెండు మాటల్లో జవాబిచ్చాడు బన్నీ. "అది నిజం. పాటలో ఏం రాశారో అది నిజం" అని ఆయన చెప్పాడు.
Also read: యూట్యూబ్‌లో రెచ్చిపోతున్న సమంత "ఊ అంటావా మావా" సాంగ్!
'పుష్ప' మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా, ఫహద్ ఫాజిల్ విలన్‌గా నటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సినిమా విడుదలవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



