చిత్ర పరిశ్రమకు మరోషాక్..సూపర్‌స్టార్ సతీమణి మృతి
on May 31, 2017
ప్రముఖ దర్శకులు దర్శకరత్న దాసరి నారాయణరావు మృతితో చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈ షాక్ నుంచి తెరుకునే లోపే సినీ పరిశ్రమకు మరో విషాదవార్త తెలిసింది. సూపర్‌స్టార్, కన్నడ కంఠీరవ డా.రాజ్‌కుమార్ సతీమణి పార్వతమ్మ రాజ్‌కుమార్ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు.
గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, మూత్రపిండ సంబంధిత అనారోగ్యంతో మే 14న బెంగళూరులోని ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో చేరారు పార్వతమ్మ. అప్పటి నుంచి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆమెకు తీవ్ర జ్వరం రావడంతో ఆరోగ్యం క్షీణించింది..దీంతో తెల్లవారుజామున 4.40 ప్రాంతంలో పార్వతమ్మ తుదిశ్వాస విడిచారు. కర్ణాటకలోని మైసూరు జిల్లా సలిగ్రామలో డిసెంబర్ 6, 1939లో జన్మించిన పార్వతమ్మ 13వ యేటనే డా.రాజ్‌కుమార్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. రాజ్‌కుమార్ విజయాల్లో కీలకపాత్ర పోషించిన పార్వతమ్మ..భర్త అడుగుజాడల్లో పూర్ణిమ ఎంటర్‌ప్రైజెస్‌ను స్థాపించి 80కి పైగా చిత్రాలను నిర్మించారు. ఆమె మరణం పట్ల కన్నడ చిత్ర పరిశ్రమ సంతాపం ప్రకటించింది.
Also Read