దాసరి గారు పద్మగారితో ప్రేమలో ఎలా పడ్డారో తెలుసా..?
on May 31, 2017
తెలుగు చిత్ర సీమలో అన్యోన్య దాంపత్యంతో అందరికీ ఆదర్శంగా నిలిచిన జంటలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వారిలో దాసరి నారాయణరావు-పద్మ జంటది అరుదైన స్థానం. ప్రతీ పురుషుడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందంటారు అలాగే దాసరి గారి విజయాల్లో పద్మ కీలకపాత్ర పోషించారు. ఆయన సినిమాను ఎంతగా ప్రేమించారో తన భార్యను అంతే ప్రేమించారు. వీరిద్దరిది ప్రేమ వివాహం.. అసలు వాళ్లిద్దరూ ఎప్పుడు, ఎక్కడ కలిశారంటే..దాసరి నారాయణరావు హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో తన చెల్లిలెకి గాజులు కొందామని సుల్తాన్ బజార్‌కి వెళ్లారు.
అయితే గాజుల సైజ్ తెలియకపోవడంతో సెల్స్‌మెన్‌కి ఆ అమ్మాయి చేతి సైజ్ ఉంటుందని అక్కడ నిలుచున్న యువతివైపు చేయి చూపించారు దాసరి. అంతే ఆవిడ ఆగ్రహంతో ఒక చూపు చూపించదట..దీనిని గమనించిన దాసరి ఏం లేదండీ మా చెల్లెలికి గాజులు కొనాలనుకుంటున్నా. తనది కూడా మీ చేతి సైజ్ ఉంటుందని చెప్పారట. ఆవిడ ఏవరో కాదు దాసరి సతీమణి పద్మ. అలా మాట మాట కలవడం..పరిచయంగా..ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లడం వెంట వెంటనే జరిగిపోయింది. పద్మ కుటుంబసభ్యులు దాసరితో పెళ్లికి అంగీకరించగా..దాసరి కుటుంబసభ్యులు మాత్రం అంగీకరించలేదు. అయినప్పటికీ పట్టుబట్టి పద్మనే పెళ్లి చేసుకున్నారు దాసరి. అలా వీరి దాంపత్యం ఆదర్శప్రాయంగా కొనసాగింది. కష్టసుఖాల్లో తనకు తోడుగా నిలిచిన పద్మగారి మరణం దాసరిని క్రుంగదీసింది. అప్పటి నుంచి ఒంటరితనంతో లోలోపల కుమిలిపోయేవారు. చివరకు ఇప్పుడు పద్మగారి దగ్గరకే వెళ్లిపోయారు.