దాసరికి నివాళి..మహేశ్ స్పైడర్ టీజర్ రిలీజ్ వాయిదా..!
on May 31, 2017
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "స్పైడర్". ఇప్పటికే షూటింగ్ పార్ట్ దాదాపు కంప్లీట్ అయ్యింది. మహేశ్ ఈ మూవీలో ఎలా ఉండబోతున్నాడా అని ఎదురుచూస్తున్న అభిమానులను రెండు పోస్టర్స్ రిలీజ్ చేసి పండగ చేసుకోమన్నారు. అయితే ప్రతీ ఏడాది తన తండ్రి కృష్ణ పుట్టినరోజు నాడు టీజర్ రిలీజ్ చేయడం అలవాటు కావడంతో మే 31 ఎప్పుడు వస్తుందా అని ప్రిన్స్ ఫ్యాన్స్ ఎదురుచూశారు. వారి అంచనాలకు తగ్గట్టే చిత్ర యూనిట్ కూడా మే 31న టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించింది. అయితే ప్రముఖ దర్శకులు, దర్శకరత్న దాసరి నారాయణరావు మరణించడంతో చిత్ర పరిశ్రమతో పాటు ప్రేక్షకులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇలాంటి టైంలో టీజర్ రిలీజ్ చేయడం సబబు కాదనుకున్న చిత్ర యూనిట్ దానిని వాయిదా వేసింది. మరోవైపు తన పుట్టినరోజు వేడుకలు కూడా చేయవద్దని అభిమానులను కోరారు కృష్ణ. అయితే స్పైడర్ టీజర్ జూన్ 1 ఉదయం 10.30 గంటలకు రిలీజ్ చేయనున్నారు.