అతడిని చితకొట్టిన ఎన్టీఆర్...!
on Nov 26, 2013
ఎన్టీఆర్ హీరోగా "కందిరీగ"తో దర్శకుడిగా తొలి సక్సెస్ ను అందుకున్న సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం "జోరు". బెల్లంకొండ గణేష్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం రామోజీఫిల్మ్ సిటీలో జరుగుతుంది. సమంత హీరోయిన్. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ... ప్రస్తుతం ఎన్టీఆర్, షాయాజీ షిండేల మధ్య వచ్చే సన్నివేశాలను చిత్రికరిస్తున్నాం. జోరుమీదున్న కుర్రకారుకి బ్రేకులు వేయాలని చూస్తే.. వాళ్ళు రెండింతల వేగంతో వచ్చి మరీ డీ కొడతారు. అలాంటిది యమా జోరు మీదున్న ఎన్టీఆర్ ను షాయాజీ అడ్డుకోవాలని చూస్తే ఎన్టీఆర్ వీర కొట్టుడు కొట్టాడు. కానీ ఎందుకు కొట్టాడు అనే విషయం సినిమా చూస్తేనే తెలుస్తుంది. ఎన్టీఆర్, సమంతల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్థాయి అని అన్నారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నారు.