మహనీయుని నామస్మరణలో టాలీవుడ్
on May 28, 2020

N'... నటన
'T'... తెగింపు
'R'... రాజసం
మహనీయుని నామస్మరణలో టాలీవుడ్
ఎన్టీఆర్... మూడు అక్షరాలు కాదు. మూడు తరాలుగా తెలుగు జాతికి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహోన్నత వ్యక్తి. నేడు ఆయన జయంతి. ఈ సందర్భంగా టాలీవుడ్ ఆయన్ను స్మరించుకుంటోంది. ఘన నివాళులు అర్పిస్తోంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎవరెవరు ఏమన్నారంటే?
"తెలుగు జాతి పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం.
తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ చెదరని జ్ఞాపకం.
నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం.
వారితో కలిసి నటించడం నా అదృష్టం.
పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ..."
- మెగాస్టార్ చిరంజీవి
"మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది.
మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది.
పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా...
సదా మీ ప్రేమకు బానిసను
మీరు లేని లోటు తీరనిది"
- యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు
"మా ఖ్యాతి మీరే, మా కీర్తి మీరే.. ఓ విశ్వవిఖ్యాత, అందుకో మా జ్యోత #joharntr"
- హీరో నందమూరి కళ్యాణ్ రామ్
"విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి నేడు...
N........ నటన
T.......... తెగింపు
R...........రాజసం"
- దర్శకుడు అనిల్ రావిపూడి
"చరిత్రపై చెరగని సంతకం... మన తారకరాముని వశం... యుగపురుషుని జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ..."
- నారా రోహిత్
"నేను తొలిసారి పెద్దాయనను తెరపై సూపర్‌మేన్‌లా చూశా. నిజజీవితంలోనూ ఆయన సూపర్‌మేన్"
- దర్శకుడు, నిర్మాత మధుర శ్రీధర్
ఇంకా పలువురు ప్రముఖులు ఎన్టీఆర్ గొప్పతనం గురించి మరోసారి గుర్తు చేసుకున్నారు. తెలుగు జాతికి ఆయన ఎంతటి గౌరవం తీసుకొచ్చింది తెలియజేశారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



