శ్యామ్ కె నాయుడిపై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు
on May 28, 2020

సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి, తనతో సహజీవనం చేసి, ఇప్పుడు మొహం చాటేస్తున్నాడంటూ శ్యామ్ కె నాయుడిపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ సాయిసుధ సంజీవరెడ్డి నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆమె ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారనీ, శ్యామ్ కె నాయుడును పోలీసులు అదుపులోకి తీసుకున్నారనీ ప్రచారంలోకి వచ్చింది. అయితే అందులో నిజం లేదని తెలిసింది. తాము ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదనీ, శ్యామ్‌ను అదుపులోకి తీసుకోలేదనీ పోలీసులు స్పష్టం చేశారు.
శ్యామ్ పెళ్లి చేసుకుంటానని మోసం చేసి సహజీవనం చేశాడంటూ ఒక నటి ఫిర్యాదు చేశారనీ, దానిపై శ్యామ్‌కు సమన్లు పంపించామనీ పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్న తెలిపారు. ఇద్దరినీ స్టేషన్‌కు పిలిపించి, సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నామనీ, సమస్య పరిష్కారం కాకపోతే శ్యామ్‌పై ఐపీసీ సెక్షన్ 493 కింద కేసు నమోదు చేస్తామనీ ఆయన చెప్పారు. సాయిసుధ సమస్యకు పరిష్కారం లభిస్తుందో, లేదో.. ఆమెకు న్యాయం జరుగుతుందో, లేదో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



