క్రిష్ చేతిలోకి ఎన్టీఆర్ బయోపిక్..
on May 28, 2018

గత కొద్దిరోజులుగా ఎన్టీఆర్ బయోపిక్ దర్శకుడి విషయంలో కన్ఫ్యూజన్ నెలకొన్న సంగతి తెలిసిందే. మొదట ఈ సినిమాకు దర్శకుడిగా తేజను అనుకున్నారు. అంతేకాదు ఈ సినిమా లాంచింగ్ కూడా చాలా గ్రాండ్ గానే చేశారు. అయితే ఏమైందో ఏమో తెలియదు కాని ఈ బయోపిక్ నుండి తాను తప్పుకుంటున్నట్టు తేజ ప్రకటించాడు. ఆ తరువాత తాను తప్పుకోవడానికి పలు కారణాలే చెప్పాడనుకోండి. ఇక అప్పటినుండి ఈసినిమాపై పలు అనుమానాలే మొదలయ్యాయి. తేజ తప్పుకున్న తరువాత ఈ సినిమాకి బాలకృష్ణనే దర్శకత్వమే వహిస్తున్నారని.. రాఘవేంద్రరావు సహాయ సహకారాలు అందిస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది. తనకి 'గౌతమీ పుత్ర శాతకర్ణి'తో భారీ సక్సెస్ ను ఇచ్చిన క్రిష్ నే బాలకృష్ణ దర్శకుడిగా ఎంచుకున్నారు. దీంతో క్రిష్ ను దర్శకుడిగా ప్రకటించడంతో ఈ ప్రాజెక్టుపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక బాలకృష్ణ కు మొదటినుండి సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. ఆయన నటించిన ఎన్నో సినిమాలు సంక్రాంతికి వచ్చి ఘనవిజయం సాధించాయి. ఇక 'గౌతమీ పుత్ర శాతకర్ణి' కూడా సంక్రాంతికే వచ్చి సంచలన విజయాన్ని సాధించింది. దాంతో ఇప్పుడు 'ఎన్టీఆర్' మూవీ కూడా సంక్రాంతికే విడుదల చేయాలని ప్లాన్ చేశారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



