మహానటిలాంటి సినిమాలు ఇక చేయను – కీర్తి సురేష్
on May 29, 2018

మహానటి విడుదల ముందు కీర్తి సురేష్ ఒక అమూల్ బేబీ మాత్రమే. హావభావాలు అంతంత మాత్రమే పలికించే గ్లామర్ పాత్రలకే ఆమె పరిమితం అని ముద్ర వేసేశారు. కానీ విమర్శకులందరి దిమ్మ తిరిగేలా సావిత్రి పాత్రలో ఆమె ఒదిగిపోయింది. దాంతో కీర్తి సురేష్, జయలలిత బయోపిక్‌లో కూడా నటిస్తుందన్న వార్తలు వినిపించాయి. ఏమనుకుందో ఏమో కానీ... ఇక మీదట బయోపిక్ సినిమాలు చేయనని కుండబద్దలు కొట్టేసింది కీర్తి. లేనిపోని వివాదాలు వస్తాయనుకుందో, ఒకే తరహా సినిమాలు చేయాల్సి వస్తుందని భయపడిందో... కారణం ఏదైనా కానీ కీర్తి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అభిమానులకు అశనిపాతమే!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



