డిజిటల్ ఇండియా అక్రమాల మీద విశాల్ సినిమా
on May 26, 2018
డిజిటల్ ఇండియా- ఇప్పుడు దేశం అంతటా ఇదే నినాదం వినిపిస్తోంది. ఆన్‌లైన్ లావాదేవీలు, క్యాష్‌లెస్ చెల్లింపులు చేయాలంటూ ప్రభుత్వం ప్రజల్ని తెగ వాయించేస్తోంది. ఆఖరికి పెద్ద నోట్ల రద్దు కూడా డిజిటల్ ఇండియాలో భాగమే అని చెప్పుకొన్నారు. ఇలాంటి పరిస్థితులలో పేటీఎం లాంటి సంస్థలు లాభపడ్డాయి సరే... మరి సామాన్యుడి పరిస్థితి ఏమిటి? ఆన్‌లైన్‌లో జరుగుతున్న అక్రమాల మాటేమిటి? ఇదే ప్రశ్నలతో ‘అభిమన్యుడు’ అనే సినిమాతో ముందుకొస్తున్నాడు విశాల్. ఏ విషయం మీదైనా కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే విశాల్ ఈ సినిమాతో ప్రభుత్వ విధానాలని తూర్పారబట్టినట్లు తెలుస్తోంది. మరి తెలుగులో ఈ సినిమాను చూడాలంటే జూన్ 1 దాకా ఆగాల్సిందే!