పవన్ తనకు దేవుడు కాదంటున్నాడు..!
on Jun 13, 2016
పవన్ కు ఇండస్ట్రీలో అతి పెద్ద అభిమాని ఎవరు..? నిస్సందేహంగా నితిన్ అన్న ఆన్సరే వస్తుంది. పవన్ కు కూడా నితిన్ అంటే చాలా ఇష్టం. ఆ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పాడు కూడా. అయితే, ఇన్నాళ్లూ తనకు పవన్ దేవుడు అన్న నితిన్ ఇప్పుడు మాట మార్చేశాడు. పవన్ తనకు దేవుడు కాదు అని చెబుతున్నాడు. ఇదేంటి అని నితిన్ ఫ్యాన్స్ కంగారు పడకండి. దేవుడు అనకుండా ఇక నుంచి ఆయన్ను తను అన్నయ్య అని పిలుస్తానంటున్నాడు. " ఆయన నా ఇష్క్ ఆడియో ఫంక్షన్ కు వచ్చి ఆడియో రిలీజ్ చేస్తే, ఫ్లాపుల్లో ఉన్న నాకు హిట్ పడింది. ఇప్పుడు అ ఆ ఆడియో రిలీజ్ చేస్తే, కెరీర్ బెస్ట్ సినిమా అయ్యింది. ఆడియో వేడుకలో ఆయన నన్ను తమ్ముడు అన్నారు. అందుకే ఇకపై నేను ఆయన్ను అన్నయ్య అంటాను. మా సినిమాలో పనిచేసిన వారందరూ కూడా కళ్యాణ్ గారి ఫ్యాన్సే " అంటున్నాడు నితిన్. గుంటూరులో గ్రాండ్ గా జరిగిన సక్సెస్ మీట్ సందర్భంగా తన మనసులోని మాటను ఇలా పంచుకున్నాడు నితిన్.