అఖిల్ కు మెగాస్టారే స్ఫూర్తి అంటున్న నాగ్..!
on Jun 13, 2016
కింగ్ నాగార్జున ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతారనే పేరుంది ఇండస్ట్రీలో. ఎవరి కోసమో పొగడటం, తిట్టడం, మొహమాటంగా మాట్లాడరు. సినీమా అవార్డ్స్ ఫంక్షన్లో ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు కింగ్. అఖిల్ సినిమాకు బెస్ట్ డెబ్యూగా అవార్డ్ లభించింది. అఖిల్ అందుబాటులో లేకపోవడంతో అతని తరపున నాగార్జున ఈ అవార్డును స్వీకరించారు. తీసుకున్న తర్వాత ఎలాంటి దాపరికం లేకుండా, అఖిల్ సినిమా పోయిందని ఒప్పుకున్నారు నాగ్. పరిశ్రమలో కష్టపడి ఎదిగిన చిరంజీవి లాంటి వాళ్ల చేతుల మీదుగా అవార్డ్ రావడం కంటే ఇంకే కావాలి. సినిమా సరిగ్గా ఆడకపోయినా, డెబ్యూ యాక్టర్ గా చిరంజీవి చేతుల మీదుగా అందుకోవడం అఖిల్ కు మంచి విషయం. ఈ అవార్డు ఎవరి చేతుల మీదుగా వచ్చిందో అఖిల్ కు చెప్తాను అన్నారు.
ఇక్కడ రెండు విషయాల్లో నాగార్జునను మెచ్చుకు తీరాల్సిందే. అఖిల్ సినిమా ఫ్లాప్ అని ఒప్పుకోవడం మొదటి విషయమైతే, తనకు పోటీ అయిన మెగాస్టార్ చిరంజీవి, అఖిల్ కు స్ఫూర్తి అని చెప్పడం రెండో విషయం. మా వాడు అంత, మా సినిమా ఇంత అంటూ ఊదరగొట్టే జనాలున్న నేటి ఇండస్ట్రీలో నాగ్ లాంటి వాళ్లు చాలా అరుదుగానే ఉంటారని చెప్పాలి.