కమల్ దర్శకుడికి అస్వస్థత..!
on Jun 13, 2016
సినిమా జరిగినంత కాలం ఏదో ఒక అడ్డు రాకపోతే, అది కమల్ సినిమా అవదు. ఏదో విధంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటాయి కమల్ హాసన్ సినిమాలు. ప్రస్తుతం ఆయన షూట్ చేస్తున్న శభాష్ నాయుడు సినిమాకు కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం, సినిమా టైటిల్ పై వివాదం మొదలైన సంగతి తెలిసిందే. తమిళనాడులో, తమ కులాల్ని అవమానించారంటూ శభాష్ నాయుడు టైటిల్ పై కేసు వేశారు కొన్ని కులాల వాళ్లు. అది అలా ఉంచితే, ప్రస్తుతం అమెరికా లో షూటింగ్ జరుగుతున్న ఈ మూవీ దర్శకుడు రాజీవ్ కుమార్ అనారోగ్యం పాలయ్యాడు. ఛాతీలో నొప్పి రావడంతో ఆయన్ను వెంటనే హాస్పిటల్ కు తరలించారు.
అయితే షెడ్యూల్ ప్రకారం జరక్కపోతే, ఖర్చు తలకు మించిన భారమవుతుంది కాబట్టి, వేరే ఆప్షన్ లేని కమల్, తనే డైరెక్ట్ చేసి సినిమాను తెరకెక్కించేస్తున్నారట. కొన్ని సీన్స్ తో పాటు ఒక సాంగ్ కూడా తీసేశారని సమాచారం. నిజానికి కమల్ తన సినిమాలకు క్రియేటివ్ హెడ్ గా వ్యవహరిస్తుంటారు. సో డైరెక్టర్ దగ్గరే ఉన్నా, సీన్స్ అన్నీ కమల్ ఇష్టానికి తగ్గట్టుగానే జరుగుతాయి. కాబట్టి సినిమా యూనిట్ ఎవరూ టెన్షన్ పడకుండా తమ పని చేసుకెళ్లిపోతున్నారట. దశావతారంలోని ఒక పాత్ర కథను కంటిన్యూ చేస్తూ తీస్తున్న సినిమా కావడం విశేషం.