నిహారిక అతడికోసమే వచ్చిందట!!
on Feb 21, 2019
శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదంటారు. అలాగే ఇప్పుడు సిద్ శ్రీరామ్ గొంతులో పడితే కానీ అది పాట కాదంటున్నారు తెలుగు సినీ శ్రోతలు, దర్శక నిర్మాతలు. `ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే` అంటూ ఇంకా ఏమి అవసరం లేదనిపించాడు తెలుగు శ్రోతల చేత సిద్ శ్రీరామ్. `గీత గోవిందం` చిత్రంలోని ఆ పాట తెలుగు చిత్ర పరిశ్రమలో బెస్ట్ సాంగ్ గా నిచిలింది. ఆ తర్వాత ప్రతి సంగీత దర్శకుడు అతనితో ఒక్క పాటైనా పాడించాలంటూ వెంట పడుతున్నారు. టాక్సీవాలాలో మాటే వినదుగా, హుషారు లో ఉండిపోరాదే, `పడి పడి లేచే మనసు`లో ఏమై పోయావే సూర్యకాంతంలో ఇంతేనా ఇంతేనా, లేటెస్ట్ గా ఏబిసిడిలో మెల్ల మెల్లగా ఇలా ఆయన ఏ పాట పాడినా ఆ పాట శ్రోతలను విపరీతంగా అలరిస్తోంది. దీంతో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ సింగ్ అయిపోయాడు సిద్ శ్రీరామ్. ఇక `ఏబిసిడి` లోని పస్ట్ సింగిల్ బుధవారం విడుదలైంది. ఈ కార్యక్రమానికి సింగర్ సిద్ శ్రీరామ్ కూడా విచ్చేసాడు. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన నిహారిక మాట్లాడుతూ...`` సిద్ శ్రీరామ్ నా ఫేవరేట్. అతడి వాయిస్ అంటే నాకు చాలా ఇష్టం. నేను నటించిన సూర్యకాంతంలో ఒక పాట పాడారు. ఆ పాట హల్ చల్ చేస్తోంది. ఇక ఈ కార్యక్రమానికి అల్లు శిరీష్ కోసం కంటే సిద్ శ్రీరామ్ కోసమే వచ్చానంటూ చెప్పకనే చెప్పింది నిహారిక.