వెంకీ-వరుణ్‌లకు తోడల్లుడు దొరికాడోచ్!!
on Feb 21, 2019
వెంకీ, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో రూపొందిన `ఎఫ్-2` సినిమా సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఈ సినిమా 120 కోట్లకు పైగా గ్రాస్ ను 85 కోట్ల షేర్ ను సాధించింది ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. దీనితో ఆగకుండా ఇటీవల డిజిటల్ ఫ్లాట్ ఫామ్ అమెజాన్‌లో విడుదలైన ఈ సినిమా ఏ మాత్రం తగ్గకుండా కలెక్షన్స్ వర్షం కురిపిస్తూనే ఉందట. ఫస్ట్ షాట్ నుంచి ఎండింగ్ ఫ్రేమ్ వరకు ప్రతి సన్నివేశంతో ప్రేక్షకుల పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అయితే ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో `ఎఫ్2` కి సీక్వెల్ గా `ఎఫ్ 3` చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు పలు ఇంటర్వ్యూస్ లో చెప్పాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అయితే ఈ సీక్వల్ ను కూడా దిల్ రాజే నిర్మించే అవకాశాలున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ సీక్వెల్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ లకు తోడల్లుఉగా హీరో నితిన్ నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. మొదట రవితేజను అనుకున్నారు కానీ, నితిన్ పేరు తెరపైకి వచ్చింది. త్వరలో ఎఫ్ 3 కి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని తెలుస్తోంది.