హీరోయిన్ పుట్టుమచ్చలపై పిచ్చి ప్రశ్న.. సారీ చెప్పిన ప్రొడ్యూసర్!
on Feb 3, 2022

సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'డీజే టిల్లు'. సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ కలసి నిర్మిస్తున్న ఈ సినిమాకి సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఫిబ్రవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ విడుదల సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో హీరోయిన్ పుట్టుమచ్చలు లెక్క పెట్టారా? అని హీరోని ఓ జర్నలిస్ట్ అడగటం వివాదాస్పదమైంది.
యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఉన్న 'డీజే టిల్లు' ట్రైలర్ ఆకట్టుకుంటోంది. అయితే ఈ ట్రైలర్ లో పుట్టుమచ్చలకు సంబంధించి ఓ డైలాగ్ ఉంది. ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయి? అని హీరో అడగగా.. 16 ఉన్నాయని హీరోయిన్ సమాధానం చెప్తుంది. అయితే ట్రైలర్ వేడుకలో ఈ డైలాగ్ ని ప్రస్తావిస్తూ.. 'నిజంగానే ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో తెలుసుకున్నారా?' అంటూ ఓ ప్రముఖ సినీ జర్నలిస్ట్ హీరోని అడిగాడు. ఆ ప్రశ్నకు అసహనం వ్యక్తం చేసిన హీరో సిద్ధు.. ఈ ప్రశ్నను అవాయిడ్ చేద్దాం అన్నాడు.
కర్ణాటకకు చెందిన హీరోయిన్ నేహాశెట్టికి ఆ ప్రశ్న ఏంటో ఆ సమయంలో అర్థం కాలేదు. ఆ తర్వాత ఆ ప్రశ్న అర్థం తెలుసుకున్న ఆమె ట్విట్టర్ వేదికగా ఆ జర్నలిస్టుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. "ఇలాంటి ప్రశ్న అడగటం దురదృష్టకరం. దీనినిబట్టి అతడు తన చుట్టూ ఉండే మహిళలని, ఇంట్లో వాళ్ళని ఎలా గౌరవిస్తాడో అర్థమవుతుంది" అంటూ చురకలు వేసింది. ఈ ట్వీట్ పై స్పందించిన నిర్మాత నాగ వంశీ 'ఇలా జరగడం దురదృష్టకరం.. సారీ నేహా" అని రీట్వీట్ చేశాడు. మరోవైపు ఆ జర్నలిస్ట్ తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



