`ఆచార్య`కి మెగాస్టార్ `ఇండస్ట్రీ హిట్` టచ్!
on Feb 3, 2022

మెగాభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం `ఆచార్య`. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ లో నటించిన ఈ సినిమాలో ఆయన తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరో హీరోగా నటించారు. విజనరీ డైరెక్టర్ కొరటాల శివ రూపొందించిన ఈ సోషల్ డ్రామా.. వేసవి కానుకగా ఏప్రిల్ 29న థియేటర్స్ లో సందడి చేయనుంది.
ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే.. గతంలో ఇదే ఏప్రిల్ 29న మెగాస్టార్ ఖాతాలో ఓ ఇండస్ట్రీ హిట్ ఉంది. ఆ సినిమానే.. `యముడికి మొగుడు`. 1988 ఏప్రిల్ 29న విడుదలైన ఈ సోషియో ఫాంటసీ మూవీ.. అప్పట్లో సంచలన విజయం సాధించడమే కాకుండా ఇండస్ట్రీ హిట్ గా నమోదయ్యింది. మరి.. సెంటిమెంట్ రిపీట్ అయి `ఆచార్య` కూడా బాక్సాఫీస్ ముంగిట నయా రికార్డులను క్రియేట్ చేస్తుందేమో చూడాలి.
Also Read: 'చిట్టి'తో షూట్ షురూ చేసిన 'రావణాసుర'!
కాగా, `ఆచార్య`లో చిరుకి జంటగా కాజల్ అగర్వాల్ నటించగా, చరణ్ కి జోడీగా పూజా హెగ్డే దర్శనమివ్వనుంది. ప్రకాశ్ రాజ్, సోనూసూద్, సంగీత ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాలో రెజీనా ఓ ప్రత్యేక గీతంలో మెరిసింది. మెలోడీబ్రహ్మ మణిశర్మ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి బాణీలు అందించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



