'కృష్ణ అండ్ హిజ్ లీల' టీజర్ వచ్చింది
on Feb 14, 2020
'క్షణం' మూవీతో అందరి దృష్టినీ తనవైపు తిప్పుకున్న రవికాంత్ పేరెపు డైరెక్ట్ చేస్తోన్న లెటెస్ట్ ఫిల్మ్ 'కృష్ణ అండ్ హిజ్ లీల'. 'గుంటూర్ టాకీస్' ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్నారు. వేలంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీ టీజర్‌ను హీరో విక్టరీ వెంకటేష్ శుక్రవారం ఆవిష్కరించారు. ఒక సమకాలీన అంశంతో ఈ టీజర్ ఆసక్తి కలిగిస్తోంది. 'క్షణం'తో పోలిస్తే తన రెండో సినిమాను ఒక డిఫరెంట్ స్టోరీతో రవికాంత్ రూపొందిస్తున్నట్లు స్పష్టమవుతోంది. టీజర్ ప్రకారం రాంగ్ టైమ్ రిలేషన్‌షిప్స్‌తో సమస్యల్లో చిక్కుకొనే యువకుడిగా ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ కనిపిస్తున్నాడు. "నా బతుకంతా నేను రాంగ్ టైంలోనే రిలేషన్‌షిప్స్‌లో ఉంటాను" అని అతను డైలాగ్ కూడా చెప్పాడు. శ్రీకృష్ణ పరమాత్ముడి తరహాలో పలువురు భామలతో అతను సరసాల్లో మునిగితేలుతుంటాడు. లిప్‌లాక్స్ కూడా చేస్తుంటాడు. హీరోయిన్లుగా శ్రద్ధా శ్రీనాథ్, సీరత్ కపూర్, శాలిని వడ్నికత్తి నటిస్తున్నారు.
సబ్జెక్టుకు తగ్గ మ్యూజిక్‌ను శ్రీచరణ్ పాకాల అందిస్తున్నారు. హీరో క్యారెక్టరైజేషన్ తెలిపేవిధంగా 'పులిహోర కలిపెనులే' అంటూ వచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ నవ్విస్తుంది. ఈ 'పులిహోర' ట్రాక్‌ను హేమచంద్ర రచించి పాడారు. సమాజంలో వైరల్ అయిన రూమర్స్ ఆధారంగా ఈ కథను రవికాంత్ రాయడం గమనార్హం. మే 1న సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామనీ, త్వరలో ట్రైలర్ రిలీజ్ చేస్తామనీ చిత్ర బృందం తెలిపింది. రానా దగ్గుబాటి సమర్పిస్తోన్న ఈ మూవీని సురేష్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
