పవన్ సినిమాకు తాజ్ మహల్... ఛార్మినార్ సెట్స్!
on Jan 30, 2020
ఎటువంటి హంగామా, హుషారు లేకుండా పవన్ కళ్యాణ్ - క్రిష్ సినిమా మొదలైంది. యూనిట్ సభ్యుల మధ్య బుధవారం పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ హీరోగా 'ఖుషి' వంటి బ్లాక్ బస్టర్ సినిమా తీసిన నిర్మాత ఏఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొఘల్స్ పరిపాలించిన సమయంలో సాగే కథతో సినిమా తెరకెక్కుతోంది. ఆల్రెడీ క్రిష్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేశారట. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు.
హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ సినిమా కోసం తాజ్ మహల్... ఛార్మినార్ సెట్స్ వేస్తున్నారట. మెజారిటీ షూటింగ్ ఈ సెట్స్ లో జరుగుతుందట. ఆల్మోస్ట్ ఈ రెండు సెట్స్ కోసం సుమారు 20 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట. ఏఎం రత్నం ఖర్చు ఏమాత్రం వెనుకాడడం లేదట. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే, ప్రగ్యా జైస్వాల్, సోనాక్షి సిన్హా తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో పాటు 'పింక్' రీమేక్ షూటింగ్ కూడా చేస్తున్నారు పవన్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
