ఆలియా కోసం 'ఆర్ఆర్ఆర్'లో పాట
on Jan 30, 2020
'ఆర్ఆర్ఆర్'లో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సరసన బాలీవుడ్ స్టార్ ఆలియా భట్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇంకా చరణ్, ఆలియా మధ్య సన్నివేశాలను షూటింగ్ చేయలేదు. అయితే... సినిమాలో ఆలియా రోల్ పెద్దగా ఉండదు. గెస్ట్ రోల్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. రాజమౌళి దర్శకత్వంలో చేయాలనేది తన డ్రీమ్ అనీ, ఆయన సినిమాలో చేసే అవకాశం రావడంతో పాత్ర నిడివి గురించి ఆలోచించలేదని ఆలియా భట్ చెప్పింది. ఆమెకు హిందీలో బోల్డంత క్రేజ్ ఉంది. సంజయ్ లీలా భన్సాలీ వంటి గొప్ప దర్శకుడు ఆలియాను మెయిన్ రోల్ లో పెట్టి మాఫియా క్వీన్ 'గంగూబాయి' సినిమా తీశాడు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆలియా కోసం 'ఆర్ఆర్ఆర్'లో ప్రత్యేకంగా ఓ పాటను రాజమౌళి షూట్ చేయాలని అనుకుంటున్నారట.
ప్రస్తుతం వికారాబాద్ అడవుల్లో 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ చేస్తున్నారు. అజయ్ దేవగణ్ పై కొన్ని రోజులుగా కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. బుధవారం విదేశాల నుండి తిరిగొచ్చిన రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా అజయ్ దేవగణ్ తో కలిశారు. దర్శకుడు రాజమౌళితో కలిసి ముగ్గురూ కలిసి దిగిన ఫోటోలు దిగారు. ఈ సన్నివేశాలు పూర్తయిన తర్వాత త్వరలో రామ్ చరణ్, ఆలియా మధ్య సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. అప్పుడే పాట కూడా తెరకెక్కిస్తారట.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
