కొత్త డైరెక్టర్‌కి నాని గ్రీన్ సిగ్నల్
on May 20, 2020
ఒకదాని తర్వాత ఒకటిగా సినిమాలు చేస్తూ కెరీర్‌లో స్పీడ్ చూపిస్తోన్న నాచురల్ స్టార్ నాని తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్ ఓడెల ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం కానున్నాడు. ఇదివరకు 'పడి పడి లేచే మనసు' చిత్రాన్ని నిర్మించి, ప్రస్తుతం 'విరాటపర్వం' చిత్రాన్ని నిర్మిస్తోన్న సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. శ్రీకాంత్ ఓడెల చెప్పిన కథ అద్భుతంగా ఉందనీ, నాని ఇప్పటివరకూ చెయ్యని క్యారెక్టర్ ఈ సినిమాలో చెయ్యనున్నాడనీ సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
ప్రస్తుతం నాని విలన్‌గా నటించిన 'వి' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్ జగదీష్', రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్‌లో 'శ్యామ్ సింగ రాయ్' సినిమాలను నాని చేస్తున్నాడు.