క్యూట్ సితార.. పాట్ మేకింగ్!
on May 20, 2020
మహేశ్, నమ్రత దంపతుల ముద్దుల కూతురు సితార చిన్న వయసులోనే అనేక పనులు చేస్తూ.. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనే నానుడిని నిజం చేస్తోంది. నాన్న పాటలకు డాన్స్ చేయడం, మేషప్ చేయడం, సొంతంగా వీడియోలు రూపొందించి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం, కోవిడ్-19 గురించి జాగ్రత్తలు చెప్పడం.. ఇలా ఎన్నో పనులు చేస్తూ తన టాలెంట్‌ను చిన్నతనం నుంచే ప్రదర్శిస్తూ వస్తోంది. తాజాగా సితార పాట్ మేకింగ్ చేస్తున్న ఓ వీడియో క్లిప్‌ను నమ్రత తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేశారు.
కుండల చక్రం మీదకు సితార తొలిసారిగా వచ్చిందనీ, ఆమె చిట్టి చేతులు చేసే మ్యాజిక్ కోసం తామంతా కుతూహలంగా ఎదురుచూశామనీ నమ్రత పోస్ట్ చేశారు. కుండ తయారు చేయడం కంటే తన చేతుల్ని శుభ్రపరచుకోవడం మీదనే సితార ఎక్కువ శ్రద్ధ చూపిందని ఆమె అన్నారు. ఆమె అన్నట్లే ఆ వీడియోలో తరచూ చేతులు చూసుకుంటూ, చేతుల కంటిని మట్టిని నీటిలో శుభ్రం చేసుకుంటూ వచ్చింది సితార. స్టార్టింగ్‌లో 'అరె.. వీడియో ఎందుకు?' అంటూ సితార నవ్వులు కురిపించడం ముచ్చటగా అనిపిస్తుంది. కాకపోతే ఇది లేటెస్ట్ వీడియో కాదు. ఇదివరకటి మెమరీస్ నుంచి తీసిన వీడియో క్లిప్ అన్నమాట. అందుకే 'మెమరీ థెరపీ.. వన్ ఫర్ ఈచ్ డే' అంటూ ఆ పోస్ట్‌లో తెలిపారు నమ్రత. ఏదేమైనా క్యూట్ సితార పాట్ మేకింగ్ ఆకట్టుకుంటోంది.
Also Read