నాగార్జునను సమంత ఏమని పిలవాలి..?
on Jan 24, 2017

టైటిల్ వినగానే ఇదేం పిచ్చి ప్రశ్న అని మీరు అనుకోవచ్చు..సమంత ఇప్పటి వరకు నాగ్‌ను ఎలా పిలిచినా..నాగచైతన్యను పెళ్లి చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మామగారు అని పిలవకతప్పదు..మీరు ఫిఫ్టీ ప్లస్‌లో కూడా చాలా యంగ్‌గా కనిపిస్తారు..అలాంటప్పుడు మీ కోడళ్ల చేత మామగారు అని పిలిపించుకోవడానికి ఇబ్బంది పడతారా అని జర్నలిస్ట్‌లు అడగ్గా..దానికి వెరైటీగా సమాధానం చెప్పారు కింగ్. శ్రియా భూపాల్ చిన్నప్పటి నుంచి నాగ్ మామ అని పిలస్తుంది. సమంత మాత్రం నన్ను మామ అని పిలిచేందుకు ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది..ఎప్పుడూ "నాగ్ సార్" అని పిలిచే సమంతను ఇకపై అలా పిలిస్తే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చినట్లు నాగార్జున నవ్వుతూ చెప్పారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



