జోకర్లంతా ఇప్పుడైనా కోలుకోవాలి..నానినా మజాకానా
on Apr 3, 2025
నాచురల్ స్టార్ నాని(nani)దసరా(Dasara),హాయ్ నాన్న,సరిపోదా శనివారం లాంటి వరుస హిట్లతో హ్యాట్రిక్ ని సాధించి మంచి జోష్ మీద ఉన్నాడు.అదే ఉత్సాహంతో ఇప్పుడు హిట్ 3 ,ది ప్యారడైజ్ అనే సినిమాలు చేస్తున్నాడు.ఈ రెండు కూడా వేటికవే డిఫరెంట్ సబ్జెట్ తో కూడిన చిత్రాలు కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.హిట్ 3 మే 1 న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుండగా'ది ప్యారడైజ్' వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela)దర్శకుడు. కొన్ని రోజుల క్రితం'రా స్టేట్ మెంట్' పేరుతో ది ప్యారడైజ్ నుంచి నాని క్యారక్టరయిజేషన్ తో కూడిన వీడియో రిలీజ్ చెయ్యగా నాని గెటప్ ప్రేక్షకుల్లో సినిమా పట్ల క్యూరియాసిటీ ని పెంచడంతో పాటు సినిమా ఎలా ఉండబోతుందో చెప్పినట్లయింది.
ఇప్పుడు 'ది ప్యారడైజ్'(The Paradise)మూవీ స్క్రిప్ట్ నాని కి నచ్చలేదని,బడ్జెట్ కూడా ఎక్కువ కావడంతో మూవీ ఆగిపోయిందనే రూమర్స్ సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయి.వీటిపై నాని టీం స్పందిస్తు ఏనుగు నడుచుకుంటు వెళ్తుంటే కుక్కలు అరుస్తుంటాయి.కానీ ది ప్యారడైజ్ పనులు అనుకున్న విధంగానే సాగుతున్నాయి.దీన్ని ఎంత గొప్పగా తీర్చిదిద్దుతున్నారో త్వరలోనే చూస్తారు.అప్పటికి వరకు మీరు రూమర్స్ సృష్టిస్తూ బతికేయండి.ఫ్యాన్స్ మా మూవీ పై చూపిస్తున్న అభిమానంతో పాటు వ్యతిరేక శక్తులని కూడా గమనిస్తున్నాం. వాటన్నిటితో ఒక శక్తిగా ఎదుగుతాం.
టాలీవుడ్ చరిత్రలోనే ది ప్యారడైజ్ గర్వించే మూవీ అవుతుంది.రూమర్స్ ప్రచారం చేసే వాళ్లంతా కోలుకోవాలని ఆశిస్తున్నాం.అభిమానులంతా గర్వపడేలా నాని ది ప్యారడైజ్ తో మీ ముందుకు వస్తారని టీం సదరు పోస్ట్ లో పేర్కొంది.తెలుగుతో పాటు తమిళ,హిందీ,మలయాళ,కన్నడ, బెంగాలీ లాంటి భాషలతో పాటు ఇంగ్లీష్,స్పానిష్ వంటి విదేశీ భాషల్లోను 2026 మార్చి 26 న విడుదల కానుంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
