రన్యారావు భర్త సంచలన నిర్ణయం..మరి కాపురం పరిస్థితి ఏంటి!
on Apr 2, 2025
గత నెల మార్చి 2 వ తేదీన బంగారం అక్రమ రవాణా కేసులో ప్రముఖ కన్నడ సినీ నటి రన్యారావు(Ranyarao)అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ఆమె బెంగుళూరు(Bengaluru)లోని ఒక జైల్లో ఉన్నారు.ఈ కేసులో సినీ హీరో విరాట్ కొండూరు కూడా అరెస్ట్ కాగా,ఈ ఇద్దరు కలిసి చాలా కాలం నుంచి బంగారం అక్రమ రవాణా చేస్తునట్టుగా నిర్దారించారు.విరాట్ కూడా ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.
తాజాగా రన్యారావు నుంచి విడాకులు కోరుతు ఆమె భర్త జతిన్ తన లాయర్ ద్వారా కోర్టు ని ఆశ్రయించాలని కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది.జతిన్,రన్యారావు కి గత ఏడాది అక్టోబర్ 6 న పరిచయం జరగగా నవంబర్ 27 న ఆ ఇద్దరి వివాహం 'పంచతారా'హోటల్ లో జరిగింది.జతిన్(Jatin)వద్దంటున్నా కూడా,వ్యాపారం చూసుకోవాలని తరచు రన్యారావు దుబాయ్(Dubai)వెళ్లి వస్తుండటంతో పెళ్లయిన కొన్ని రోజులకే ఆమెకి దూరంగా ఉంటూ వస్తున్నాడు.
రన్యారావు ని అరెస్ట్ చేసినప్పుడు పోలీసులు జతిన్ ని కూడా విచారించి అతని ప్రమేయం లేదని నిర్ధారించుకున్నాకే వదిలేయ్యడం జరిగింది.ఈ కేసు నుంచి బయటపడినా కూడా ఇక రన్యారావు తో ఉండటం సాధ్యం కాదనే జతిన్ విడాకులకి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
