పాన్ ఇండియా స్టార్స్ లైనప్.. ఎవరిది బెస్ట్? ఎవరిది వీక్?
on Apr 3, 2025
ఈ తరంలో టాలీవుడ్ లో ఆరుగురు టాప్ స్టార్స్ ఉన్నారు. అందులో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాజకీయాలతో బిజీ అయిపోయారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో.. చేతిలో ఉన్న సినిమాలు పూర్తి కావడమే గొప్ప అన్నట్టుగా పరిస్థితి ఉంది. మహేష్ బాబు (Mahesh Babu) విషయానికొస్తే, ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఒక భారీ సినిమా చేస్తున్నాడు. అది విడుదల కావడానికి కనీసం రెండు మూడేళ్ళు పడుతుంది. అప్పటివరకు మహేష్ కొత్త సినిమాలు కమిట్ అయ్యే అవకాశముండదు. ఇక మిగిలింది నలుగురు స్టార్స్. ప్రజెంట్ ఈ నలుగురూ కూడా పాన్ ఇండియా స్టార్స్ కావడం విశేషం. మరి వీరి లైనప్ ఎలా ఉందో చూద్దాం.
'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన ప్రభాస్ (Prabhas).. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. గతేడాది 'కల్కి'తో మరో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న ప్రభాస్ చేతిలో ప్రస్తుతం పలు సినిమాలు ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో చేస్తున్న 'ది రాజా సాబ్', హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్న 'ఫౌజి' షూటింగ్ దశలో ఉన్నాయి. ఆ తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్', 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ లైన్ లో ఉన్నాయి. వీటితో పాటు ప్రశాంత్ నీల్ తో 'సలార్-2', నాగ్ అశ్విన్ తో 'కల్కి-2' కూడా చేయాల్సి ఉంది.
'పుష్ప-2'తో సంచలనం సృష్టించిన అల్లు అర్జున్ (Allu Arjun).. తన తదుపరి సినిమాలతోనూ అదే జోరు కంటిన్యూ చేయాలి అనుకుంటున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మైథలాజికల్ ఫిల్మ్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో యాక్షన్ ఫిల్మ్ చేయనున్నాడు. ఆ తర్వాత 'పుష్ప-3' లైన్ లో ఉంది. అలాగే, సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లోనూ ఓ సినిమా కమిటై ఉన్నాడు.
'ఆర్ఆర్ఆర్', 'దేవర' సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి 'వార్-2' అనే బాలీవుడ్ ఫిల్మ్ చేస్తున్నాడు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' కూడా మొదలైంది. వీటితో పాటు 'దేవర-2' లైన్ లో ఉంది. అలాగే, కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ తో ఒక మూవీ చేయనున్నాడని సమాచారం.
'ఆర్ఆర్ఆర్'తో గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న రామ్ చరణ్ (Ram Charan).. ఆ తర్వాత 'గేమ్ ఛేంజర్'తో నిరాశపరిచాడు. ప్రస్తుతం 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది' సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో ఒక సినిమా చేయనున్నాడు. లోకేష్ కనగరాజ్ తోనూ ఓ ప్రాజెక్ట్ చేసే అవకాశముందని వార్తలొస్తున్నాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
