బాలయ్య 101వ సినిమాలో రాష్ట్రపతి
on Oct 27, 2016
తన వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి షూటింగ్‌లో ఒకపక్క బిజీగా ఉంటూనే తన 101వ సినిమాను త్వరగా సెట్ మీదకు ఎక్కించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు నందమూరి బాలయ్య. ఈ నేపథ్యంలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీతో రైతు అనే సినిమాలో నటించనున్నట్లు బాలయ్య ప్రకటించారు. గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత రైతు పట్టాలెక్కబోతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఈ విషయం పైనే బాలయ్య, కృష్ణవంశీ ముంబైలో అమితాబ్‌ను కలిసి రైతు కథ గురించి చర్చించారు కూడా. అప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు ఎక్కువయ్యాయి. బిగ్ బి పాత్ర ఎలా ఉండబోతోంది..? అనే విషయంపై టాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే రైతులో అమితాబ్ రాష్ట్రపతి పాత్రలో కనిపించబోతున్నారని ఫిలింనగర్ టాక్. రైతు నాయకుడిగా బాలకృష్ణ రాష్ట్రపతిని కలుసుకునే కొన్ని సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయట.