బుల్లితెరపై తేలిపోయిన జనతా గ్యారేజ్..!
on Oct 27, 2016

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంభినేషన్లో తెరకెక్కిన జనతా గ్యారేజ్ విడుదలకు ముందు విడుదల తర్వాత సెన్షేషన్ క్రియేట్ చేసింది. సినిమా బాగోలేదంటూ వచ్చిన వార్తలకు కలెక్షన్స్‌తో గట్టి సమాధానం చెప్పింది గ్యారేజ్. ఇదంతా పక్కనబెడితే ఈ సినిమా ఇంకా ధియేటర్లలో ఉండగానే ఓ ఛానల్ వారు అప్పుడే టీవీలో ప్రసారం చేశారు. దీనిపై ఫ్యాన్స్ అభ్యంతరాలను సదరు ఛానల్ వారు ఏమాత్రం పట్టించుకోలేదు. ఇంత రచ్చ జరిగిన తర్వాత కూడా వెనక్కు తగ్గకుండా టీవీలో ప్రసారం చేసి టీఆర్పీని కొల్లగొడదామనుకున్న ఛానెల్ ఆశలు ఆవిరయ్యాయి.
రికార్డులు తిరగరాస్తుందనుకుంటే..అస్సలు తెలిపోయింది. దీనికి కారణం ఆ ఛానెల్ స్వయంకృతమే అంటున్నారు విశ్లేషకులు. ఈ మూవీని రూ.12.5 కోట్లకు సోంతం చేసుకున్న ఆ ఛానెల్ యాజమాన్యం..ఆ మొత్తాన్ని ఒకేదెబ్బకు వసూలు చేయాలనే ఉద్దేశ్యంతో జనం మీద యాడ్స్ కుమ్మరించింది. దాంతో..ఈ సినిమా కంప్లీట్ కావడానికి నాలుగున్నర గంటల సమయం దాటిపోయింది. సహనం నటించి బోర్ ఫీల్ అయిన సగటు ప్రేక్షకుడు పక్క ఛానెల్‌కు వెళ్లిపోయాడు. అందుకే టీఆర్‌పీ రేటింగ్స్ తక్కువగా నమోదయ్యాయని తెలుస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



