లక్ష్మితో రాజమౌళి.. ఝాన్సీ లక్ష్మీబాయ్
on Oct 27, 2016
మంచు లక్ష్మీ ప్రసన్న కలలు మామూలుగా లేవు. వీర లెవిల్లో ఫ్యూచర్ ప్లాన్స్ వేసేసుకొంటోంది. తాజాగా తన మనసులోని భయంకరమైన కోరిక బయటపెట్టింది. ఝాన్సీ లక్ష్మీబాయ్ పాత్రని పోషించాలని ఉందని, ఆ సినిమాని రాజమౌళి డైరెక్ట్ చేస్తే బాగుంటుందని ఓ అద్భుతమైన ఆలోచన బయటపెట్టింది. ఈ సంగతి రాజమౌళికి తెలిసిందో... లేదో మరి. అన్నట్టు బాహుబలి సినిమాలో శివగామి పాత్రకి ముందు తన పేరే పరిశీలించారని, శివగామి పాత్రకంటే తన ఏజ్ తక్కువ ఉండడం వల్ల ఒప్పుకోలేదని ఓ జోకులాంటిది వేసింది.
బాహుబలి సినిమాలో రాజమౌళి ఓ క్యారెక్టర్ ఆఫర్ చేయడం.. దానికి `నో` చెప్పడమా?? రాజమౌళి ఎప్పుడు పిలుస్తాడా అంటూ యావత్ దక్షిణాది చిత్రపరిశ్రమ, ఆ మాటకొస్తే బాలీవుడ్ నటులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటిది లక్ష్మీ ప్రసన్న కోసం రాజమౌళి ఓ పాత్ర ఆఫర్ చేయడమూ.. దాన్ని మంచు పాప తిరస్కరించడమా? ఇదేం నమ్మబుల్‌గా లేదు. టీవీ షోలలో బిజీ బిజీగా గడిపేస్తూ.. అప్పుడప్పుడూ వెండి తెరపై కూడా హల్ చల్ చేస్తున్న లక్ష్మీ ప్రసన్నకు ఇలాంటి పెద్ద పెద్ద కోరికలే ఉన్నాయన్నమాట. మరి రాజమౌళి ఎలా స్పందిస్తాడో చూడాలి.