నాగ్ కి గుండు కొట్టేయడం ఖాయం!
on Nov 28, 2016
కథ నచ్చితే ఎలాంటి పాత్ర చేయడానికైనా వెనుకంజ వేయని కథానాయకుడు నాగార్జున. ప్రయోగాలు చేశారుగానీ.. ఆయన ఆహార్యాన్ని మార్చుకోవడానికి ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఆయన నవ `మన్మథుడు`లానే కనిపించడానికి మొగ్గు చూపారు. అయితే తొలిసారి నాగార్జున గుండు కొట్టించుకోబోతున్నారు. అదీ ఓ సినిమా కోసం. వివరాల్లోకెళ్తే... నాగార్జున ప్రధాన పాత్రలో రాజుగారి గది 2 సెట్స్‌పైకి వెళ్లింది. ఓంకార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీవీపీ సంస్థ నిర్మిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నాగ్ ఈ సినిమాలో గుండుతో కనిపిస్తారని తెలుస్తోంది. నాగ్ గుండుతో కనిపించడం ఇదే తొలిసారి.
మన్మథుడులాంటి నాగార్జున కు గుండు సెట్ అవుతుందా? ఆయన్ని అలా చూసి అభిమానులు ఒప్పుకోగలరా? అనేవి సందేహాలే అయినా.... ఓ పాత్ర కోసం ఇలాంటి ధైర్యం చేయడం నాగార్జునకే చెల్లింది. అన్నట్టు.. ఈ సినిమాలో నాగ్ ఓ ఆత్మగా కనిపించే అవకాశాలున్నాయి. ఇది వరకు సోగ్గాడే చిన్నినాయినా సినిమాలోనూ నాగ్ ఆత్మ గానే కనిపించాడు. అయితే అది నవ్వించింది.. ఈ ఆత్మ భయపెడుతుంది. ఓ హారర్, థ్రిల్లర్ చిత్రంలో నాగార్జున నటించడం కూడా ఇదే తొలిసారి. మరి ఈ ప్రయోగం ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో చూడాలి.