పవన్ హీరోయిన్.. భలే చెప్పింది
on Nov 28, 2016
సాధారణంగా అత్యాచారాల గురించి, వాటికి సంబంధించిన విషయాల గురించీ మాట్లాడడానికి అమ్మాయిలు, అందులోనూ కథానాయికలు ముందుకు రారు. అదో సున్నితమైన విషయంగా భావిస్తుంటారు. అయితే... ఓ కథానాయిక మాత్రం రేప్ గురించీ.. రేపిస్టుల గురించీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. రేపిస్టులను ఏకి పారేసింది. ఆ కథానాయికే మీరా జాస్మిన్. గుడుంబా శంకర్, భద్ర తదితర సినిమాల్లో చాలా పద్దతిగా, హోమ్లీగా, అమాయకంగా కనిపించిన మీరా జాస్మిన్.. ఈ స్థాయిలో స్పీచ్ ఇస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారి జననాంగాలు కోసి వాళ్లని నపుంసకులుగా మార్చేసేలా చట్టాలు రావాలని, మహిళలంతా ఏకమై ఈ విషయంలో ఉద్యమించాలని కోరింది మీరా.
కేరళలో ఓ దళిత మహిళపై జరిగిన అత్యాచారానికి వ్యతిరేకంగా మీరా గళం ఎత్తింది. బాధితురాలికి అండగా మీడియా ముందుకొచ్చి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల సినిమాలు బాగా తగ్గిపోయి కామ్ అయిపోయిన మీరా.. ఈ స్థాయిలో మీడియాని ఆకర్షిస్తుందని ఎవరూ ఊహించలేదు. మీరా మాటలు, ఆమె సీరియస్ నెస్ చూస్తుంటే తను కూడా రాజకీయాల్లోకి అడుగుపెడుతుందేమో అని గుసగుసలాడుకొంటున్నారు ఆమె సన్నిహితులు. మరి మీరా లక్ష్యం, ధ్యేయం ఏమిటో? తన ఆవేశం మాటలకే పరిమితం చేస్తుందో, లేదంటే చేతల్లోనూ చూపిస్తుందో..?? కాలమే చెప్పాలి.