"బోయపాటి" అడకత్తెరలో పొకచెక్క
on Nov 28, 2016
టాలీవుడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణలు తమ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా చెప్పుకునే సినిమాల్ని ఆల్‌మోస్ట్ కంప్లీట్ స్టేజ్‌కు తీసుకువచ్చేశారు. అవే ఖైదీ నెం.150, గౌతమీపుత్ర శాతకర్ణి. ఈ రెండు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు అల్రెడి ఎనౌన్స్ చేసేశారు కూడా. సరే అంతా బాగానే ఉంది..వీరిద్దరి తర్వాతి సినిమాలు ఏంటీ..ఎవరితో చేయబోతున్నారు. అనేది మాత్రం సస్పెన్స్‌గా మారింది.
కృష్ణవంశీతో బాలయ్య రైతు అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించేశాడు..ఎట్టి పరిస్థితుల్లో జనవరిలోగా దానిని సెట్స్ మీదకు సన్నాహాలు కూడా చేసుకున్నారు. కానీ ఈ సినిమాలో అతిథి పాత్ర చేస్తానని మాట ఇచ్చిన బిగ్‌బి ఆఖర్లో షాక్ ఇవ్వడంతో మొత్తం ప్రాజెక్టె అటకెక్కింది. దీంతో తన 101వ సినిమా ఎవరితో చేయాలా..? అని బాలయ్య తర్జన భర్జనలు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో తనకు సింహా, లెజెండ్ లాంటి మాస్ హిట్స్ ఇచ్చిన బోయపాటితో సినిమా చేయాలని చూస్తున్నాడట నందమూరి అందగాడు.
ఇక మెగాస్టార్ విషయానికి వస్తే సుమారు 9 సంవత్సరాల లాంగ్ గ్యాప్ తర్వాత ముఖానికి రంగేసుకుని తన 150వ సినిమాగా ఖైదీ నెం.150 చేస్తున్నాడు చిరు. అయితే ఖైదీలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా తన మార్క్ మాస్ ఇమేజ్ అంతగా లేదని మెగాస్టార్ ఫీలయ్యారట. అందుకే ఖైదీ తరువాత ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్ చేయాలని ఫిక్స్ అయ్యాడట..ఈ నేపథ్యంలో మాస్ పల్స్ బాగా తెలిసిన బోయపాటి అయితేనే తనకు న్యాయం చేయగలడని చిరంజీవి భావిస్తున్నాడట. ఇటు బోయపాటి పరిస్థితి చూస్తే అడకత్తెరలో పొకచెక్క మాదిరిగా తయారైంది. ఇద్దరిలో ఎవరికి సై అన్నా రెండోవారు తనకు దూరమవుతారు. దీంతో ఏంచేయాలో తెలియక డైలమాలో పడిపోయాడట బోయపాటి. మరి చూద్దాం ఏం జరుగుతుందో.!