నాని చిత్రంలో నాగ్ హీరోయిన్?
on Jul 5, 2021

కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని మల్టీస్టారర్ `దేవదాస్` (2018)లో నాగ్ కి జోడీగా దర్శనమిచ్చింది ఆకాంక్ష సింగ్. కట్ చేస్తే.. ఇప్పుడు నాని నిర్మిస్తున్న ఓ చిత్రంలో ఓ కథానాయికగా నటించబోతోందట ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.
ఆ వివరాల్లోకి వెళితే.. తన సోదరి దీప్తి ఘంటాను దర్శకురాలిగా పరిచయం చేస్తూ వాల్ పోస్టర్ సినిమా పతాకంపై దాదాపు రూ.10 కోట్ల బడ్జెట్ తో `మీట్ క్యూట్` పేరుతో ఓ ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ ని నిర్మిస్తున్నారు నాని. ఇందులో ఐదుగురు కథానాయికలకు స్థానముందని.. అందులో ఒకరిగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఎంపికైందని ప్రచారం సాగుతోంది. అంతేకాదు.. `జెంటిల్ మన్`, `నిన్ను కోరి` చిత్రాల్లో నానికి జంటగా నటించిన నివేదా థామస్ కూడా ఇందులో ఓ హీరోయిన్ గా సెలెక్ట్ అయిందని టాక్. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. `మళ్ళీరావా`, `దేవదాస్` చిత్రాలతో తెలుగునాట నాయికగా గుర్తింపు తెచ్చుకున్న ఆకాంక్ష సింగ్ కూడా ఈ విమెన్ సెంట్రిక్ ఆంథాలజీలో నటించబోతోందట. త్వరలోనే `మీట్ క్యూట్`లో ఆకాంక్ష ఎంట్రీపై క్లారిటీ రానుంది. కాగా, వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



