రామ్ దర్శకుడితో నాగచైతన్య?
on Jul 3, 2021

ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో `నేను శైలజ`, `ఉన్నది ఒకటే జిందగీ`, `రెడ్` చిత్రాలను రూపొందించి దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కిశోర్ తిరుమల. మధ్యలో సుప్రీమ్ హీరో సాయితేజ్ తో `చిత్రలహరి`ని తీర్చిదిద్దిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్.. ప్రస్తుతం యంగ్ హీరో శర్వానంద్ తో `ఆడాళ్ళూ మీకు జోహార్లు` పేరుతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు. కాగా, ఈ చిత్రం పూర్తయ్యేలోపే మరో ప్రాజెక్ట్ ని సెట్ చేసుకున్నారట కిశోర్.
ఆ వివరాల్లోకి వెళితే.. ఇటీవల యువసామ్రాట్ నాగచైతన్యతో కిశోర్ తిరుమల కథాచర్చలు జరిపారట. కథ, తన పాత్ర నచ్చడంతో చైతూ వెంటనే ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంతేకాదు.. ఇదో ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని.. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని సమాచారం. త్వరలోనే చైతూ, కిశోర్ తిరుమల కాంబినేషన్ మూవీపై క్లారిటీ రానుంది.
ఇదిలా ఉంటే.. చైతూ తాజా చిత్రం `లవ్ స్టోరి` విడుదలకు సిద్ధమవగా.. `థాంక్ యూ` చిత్రీకరణ తుదిదశలో ఉంది. అలాగే హిందీలో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ చేస్తున్న `లాల్ సింగ్ చద్ధా`లో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు చైతూ. మరోవైపు `సోగ్గాడే చిన్ని నాయనా` సీక్వెల్ లోనూ చైతూ నటించబోతున్నట్లు ప్రచారం సాగుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



