మోహన్‌లాల్‌తో నాలుగోసారి
on Jul 3, 2021

మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ కి అచ్చొచ్చిన దర్శకుల్లో జీతూ జోసెఫ్ ఒకరు. వీరిద్దరి కలయికలో వచ్చిన `దృశ్యం` (2013) ఇండస్ట్రీ హిట్ గా నిలవడమే కాకుండా.. పలు భాషల్లో రీమేక్ అయి అన్ని చోట్లా వసూళ్ళ వర్షం కురిపించింది. ఇక `దృశ్యం`కి సీక్వెల్ గా రూపొందిన `దృశ్యం 2` (2021) కూడా ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ చూసిన ఈ కాంబినేషన్ లో ప్రస్తుతం `రామ్` పేరుతో ముచ్చటగా మూడో సినిమా రూపొందుతోంది. ఇందులో చెన్నై పొన్ను త్రిష కథానాయికగా నటిస్తోంది.
ఇదిలా ఉంటే.. `రామ్` చిత్రీకరణ దశలో ఉండగనే మోహన్ లాల్ - జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో మరో సినిమా సెట్ అయిందట. మిస్టరీ థ్రిల్లర్ గా ఈ చిత్రం ఉంటుందని మాలీవుడ్ టాక్. త్వరలోనే మోహన్ లాల్, జీతూ జోసెఫ్ ఫోర్త్ జాయింట్ వెంచర్ పై క్లారిటీ రానున్నది. మరి.. రానున్న సినిమాలతోనూ ఈ సెన్సేషనల్ కాంబో మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందేమో చూడాలి.
కాగా, జీతూ జోసెఫ్ తెలుగులో నేరుగా రూపొందించిన `దృశ్యం 2` రీమేక్ (విక్టరీ వెంకటేశ్, మీనా) విడుదలకు సిద్ధమవగా.. మోహన్ లాల్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ `మరక్కర్` ఆగస్టులో రిలీజ్ కి రెడీ అవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



