మా నాన్న ‘వకీల్ సాబ్’
on May 2, 2020

‘వకీల్ సాబ్’ అంటే పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అనుకునేరు!? ఆ సినిమాలో పవన్‌ది లాయర్ రోల్ కాబట్టి, ‘వకీల్ సాబ్’ అని పెట్టారు. లావణ్యా త్రిపాఠీ విషయానికి వస్తే... ఆమె తండ్రి నిజంగా లాయర్. అందుకని, ‘‘మా నాన్నగారు వకీల్ సాబ్ (లాయర్)’’ అని చెబుతోంది. తన ఫోనులో అమ్మానాన్న జంటగా దిగిన ఫొటోను ప్రజెంట్ వాల్ పేపర్‌గా పెట్టుకున్నానని ఆమె తెలిపింది. లాక్‌డౌన్ కారణంగా తల్లిదండ్రుల దగ్గరకు అందాల రాక్షసి వెళ్లలేని పరిస్థితి. అందుకే, ఫోను చూసినప్పుడల్లా వాళ్లు గుర్తుకు రావాలని అలా పెట్టుకున్నారన్నమాట! ఇప్పుడీ అందాల భామ ఏం చేస్తున్నారంటే? నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, షోలు చూస్తున్నారు. ప్రేక్షకులకు ఏం ఏం చూడాలో చెబుతున్నారు కూడా!
‘‘నెట్‌ఫ్లిక్స్‌లో తనకు నచ్చిన సినిమాలు, షోస్ గురించి చెబుతూ...
Dark,
Altered carbon,
Tiger King,
Kingdom,
Dexter,
Evil Genius
Unbreakable kimmy smith,
True Detective
చూడండి. బావుంటాయి. ఇంకా చాలా చాలా ఉన్నాయి’’ అని లావణ్య త్రిపాఠీ చెప్పారు. భవిష్యత్తులో వెబ్ సిరీస్‌లు చేయడానికి సిద్ధమని ఆమె చెప్పారు. మలయాళంలోనూ సినిమాలు చేయాలనుందని తెలిపారు. నటిగా తనకు ఇష్టమైన పాత్రను త్వరలో, లాక్‌డౌన్ ముగిసిన తర్వాత చేయబోతున్నానని అన్నారామె.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



