తమ్ముడితో రకుల్ కబడ్డీ కబడ్డీ...
on May 2, 2020

ఒక్క కబడ్డీ కబడ్డీ ఏంటి? ఇంకా చాలా ఆటలు రకుల్ ప్రీత్ సింగ్ ఆడుతున్నారు. తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ తో కలిసి హ్యాపీగా, ఇంటి నుండి కాలు బయట పెట్టకుండా సమయాన్ని గడుపుతూ సరదాగా ఉంటున్నారు. ఫ్యామిలీ మనతో ఉన్నప్పుడు చేసే ప్రతి పని చాలా సరదాగా ఉంటుందని రకుల్ అన్నారు. ప్రస్తుతం ముంబైలో ఉన్నారీ బ్యూటీ. తల్లిదండ్రులు ఢిల్లీలో ఉన్నారు. తన దగ్గర తమ్ముడు ఉండడంతో ప్రతిరోజు టైమ్ పాస్ చేస్తున్నారు.
లాక్ డౌన్ తనను చిన్నప్పటి రోజులకు తీసుకువెళ్లిందని రకుల్ తెలిపారు. చిన్నతనంలో తమ్ముడితో కలిసి ఆడిన ఆటలను మళ్లీ ఆమె ఆడారు. కబడ్డీ కబడ్డీ, డాగ్ అండ్ బోన్ తదితర ఆటలు ఆడారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది పులుసు పోయడం ఆట గురించి. నువ్వు నాకు నచ్చావ్ లో వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ ఆడిన ఆట. ఒకరు పులుసు పోస్తుంటే మరొకరు చేత్తో కొడతారు. ఈ ఆటలో రకుల్ చేతిని అమన్ చాలా గట్టిగా కొట్టారు. ఆటల్లో ఇవన్నీ కామన్ కదా! అందుకని, ఫైనల్ గా రకుల్ హ్యాపీ. ఇంట్లో బోర్ కొడుతున్నవాళ్ళు ఎవరైనా ఉంటే రకుల్ ఆడినట్టు, చిన్నతనంలో ఆడిన ఆటలు మరొక్కసారి కుటుంబ సభ్యులతో కలిసి ఆడే ప్రయత్నం చేయండి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



