కృష్ణుడి మేనమామపై కమల్ సినిమా
on May 2, 2020

హిందూ పురాణాల గురించి, ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ కంసుడి గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది. కృష్ణుడికి కంసుడు మేనమామ. మధుర రాజ్యానికి రాజు. సోదరికి పుట్టబోయే బిడ్డ వలన గండం ఉందని కృష్ణుడి కంటే ముందు పుట్టిన ఎడుగురు మేనలుళ్లను చంపేస్తాడు. తర్వాత కృష్ణుడు మేనమామను వధిస్తాడు. ఇప్పుడీ కంసుడి ప్రస్తావన ఎందుకంటే... లోకనాయకుడు కమల్ హాసన్ అతడిపై కథ రాస్తున్నారు. సినిమా కూడా తెరకెక్కిస్తారట. అయితే, అందరికీ తెలిసిన కథను కాకుండా, కంసుడు మరణించిన తర్వాత ఏమైందనే అంశంతో కథ రాస్తున్నానని కమల్ తెలిపారు. ఆల్రెడీ సినిమాకి టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. ‘చిన్న కంస’ అని. ఒకవేళ కంసుడి కొడుకును ఈ సినిమాలో చూపిస్తున్నారేమో!
విజయ్ సేతుపతితో శనివారం ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడినప్పుడు ఈ సినిమా గురించి కమల్ హాసన్ చెప్పారు. అలాగే, తన డ్రీమ్ ప్రాజెక్ట్, 23 ఏళ్ల క్రితం ప్రారంభమైన ‘మరుదనాయగం’ గురించీ కమల్ మాట్లాడారు. ‘‘అందులో కథానాయకుడి వయసు 40 ఏళ్లు అటు ఇటుగా ఉంటుంది. ఇప్పుడు ఆ పాత్ర చేయడానికి నాకు వయసు ఎక్కువైంది. ఒకవేళ డబ్బులు సమకూరి సినిమా చేయాలంటే కథ మార్చి మళ్లీ రాయాలి. లేదంటే యంగ్ యాక్టర్ ఎవరినైనా తీసుకుని సినిమా చేయాలి’’ అని కమల్ హాసన్ అన్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



