మై డియర్ విష్ణుగారూ.. నా రాజీనామాను వాపస్ తీసుకుంటా.. బట్ వన్ కండిషన్!
on Oct 12, 2021
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రాథమిక సభ్యత్వానికి తాను చేసిన రాజీనామాను ఉపసంహరించుకుంటానని ప్రకాశ్‌రాజ్ ప్రకటించారు. అయితే తెలుగువాడు కానివాడు మా ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు అంటూ బైలాస్ మార్చకపోతేనే ఆ పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం మీడియా మీట్లో మాట్లాడిన ఆయన, మా ఎన్నికల్లో గెలుపొందిన తమ ప్యానల్ సభ్యులు 11 మంది తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగానే ఆయన తన రాజీనామా విషయాన్ని ప్రస్తావించారు.
నా తరపు నుంచి ఒక మాట చెప్పాలి. నేను నా మా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా ఇచ్చాను. మా ప్రెసిడెంట్ విష్ణు గారు ప్రకాశ్‌రాజ్ రాజీనామాను స్వీకరించనని అన్నారు. ఒప్పుకుంటా. నా రాజీనామాను తిరిగి తీసుకుంటా. కానీ ఒక కండిషన్. మై డియర్ ప్రెసిడెంట్ విష్ణుగారూ.. రేపు మీరు బైలాస్‌లో తెలుగువాడు కానివాడు పోటీ చేయడానికి వీల్లేదు అని మార్చకపోతే నా రాజీనామాను వాపస్ తీసుకుంటా. ఒకవేళ మారిస్తే, ఓటెయ్యడానికో, గెలిపించడానికో మాత్రమే మెంబర్ అవడం నాకిష్టం లేదు. 'ఎవరైనా పోటీ చేయొచ్చు, భాష సమస్య లేదు, ఔట్‌సైడర్-ఇన్సైడర్ అనేది లేద'ని మీరు మాటిస్తే నా రాజీనామాను తిరిగి తీసుకుంటా. అది మీరు చెప్పాలి. అన్నారు ప్రకాశ్‌రాజ్.
అందర్నీ కలుపుకొని వెళ్తానన్న విష్ణు ప్రెస్‌మీట్ పెట్టి జనరల్ సెక్రటరీ మావాడే, ట్రెజరర్ మావాడే, ఎవరడ్డొచ్చినా మాదే మెజారిటీ అన్న మాటలకు చాలా బాధపడ్డామని ఆయన చెప్పారు. అది కలుపుకొని వెళ్లే విషయం కాదు. ఇలా మీరు, మేము అంటే కలిసి పనిచేయగలమా? ఇలా సగం, సంగం ప్యానల్ వస్తే.. మునుపటి రేండుళ్లు చూశాం.. పనిచేయలేకపోయారు. 'మా' మసకబారింది అనేవరకు వచ్చేసింది. మాకు కావాల్సింది అది కాదు. ఇలాంటి వాతావరణంలో పనిచేయలేమనే ఉద్దేశంతోనే మా ప్యానల్ సభ్యులు రాజీనామా చేస్తున్నారు" అని ప్రకాశ్‌రాజ్ తెలిపారు.
Also Read