'ముకుంద' సందడి మొదలైంది
on Dec 3, 2014
మెగా ఫ్యామిలీ నుంచి కొత్తగా వస్తున్న హీరో వరుణ్ తేజ్ 'ముకుంద' సందడి మొదలైంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ రోజు మెగా హీరోల సమక్షంలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించిన సాంగ్ టీజర్ ఒకటి రిలీజ్ చేసారు. ఈ టీజర్ లో వరుణ్ తేజ తన డాన్సులతో పర్వాలేదనిపించాడు. లుక్స్ లో మాత్రం మాస్‌ని, క్లాస్‌ని ఆకట్టుకోగల ఫీచర్స్ ఉన్నాయి. లేడీస్ ఫాలోయింగ్ ఇతగాడికి త్వరగా వచ్చే అవకాశాలున్నాయి. ఈ సినిమా ఆడియో టీజర్ లు చూస్తుంటే సంగీత దర్శకుడు మిక్కి జే మేయర్ మంచి పాటలు అందించినట్లు తెలుస్తోంది. ఇటీవలే ఈ సినిమా ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ సంస్థవారు సుమారు 45 లక్షలకు సొంతం చేసుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.