వర్మ ఆత్మహత్య చేసుకొంటాడట
on Dec 3, 2014
జీవితాన్ని ఎంతలా అనుభవించాలో వర్మకి తెలిసినంతగా మరొకరికి తెలీదేమో..? హిట్టూ, ఫ్లాపూ ఇవేం పట్టించుకోడు. రేపటి గురించి ఆలోచించడు. ఈ రోజు హ్యాపీగా బతికేస్తే చాలనుకొంటాడు. దాని కోసం ఏమైనాచేస్తాడు. అయితే మరణం ముగింట వర్మ ఆలోచనలు ఎలా ఉంటాయ్..?? కాసేపట్లో చనిపోతానని తెలిస్తే ఏ విధంగా పీల్ అవుతాడు? అనారోగ్యంతో మంచంపై పడితే ఆయన ఫీలింగ్స్ ఏమిటి?? వీటిని క్యారీ చేసింది ఓ ఛానల్. ''మంచంపై పడి మరొకరితో సేవ చేయించుకొనే సీన్‌ని నేను ఊహించలేకపోతున్నా. అలాంటి పరిస్థితి వస్తే.. ఆత్మహత్య చేసుకొంటా. నా మరణం ఎప్పుడో తెలిస్తే.. నేనంటే ఎవ్వరూ గుర్తుపట్టని ఏకాంత ప్రదేశానికి వెళ్లిపోతా. నా శవాన్ని కూడా ఎవరికీ చూపించను'' అంటూ హార్ట్ టచింగ్ కామెంట్స్ చేశాడు వర్మ. అవకాశం వస్తే డెత్‌ని కూడా బర్త్ డేగా సెలబ్రేట్ చేసుకొంటాడట. వర్మ.. ఏదైనా చేయగలడు. హి ఈజ్ జీనియస్!!